ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

పెద్దవంగర: మండలంలోని పెద్దవంగర ఎక్స్‌రోడ్ వద్ద గల ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానించి, వారు అందిస్తున్న విద్యా సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు తమ అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సన్మానం చేసిన విద్యార్థులకు, కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *