సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

– డివైడర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధమైన వోల్వో కారు.. వ్యక్తి సజీవ దహనం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సూర్యాపేట: సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఖమ్మం–హైదరాబాద్ 365బీ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వోల్వో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు.

కారు నంబర్ ప్లేట్ పూర్తిగా కాలిపోవడంతో మృతుడి వివరాలు, వాహనం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలు తెలియరాలేదు. సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ ఎం. అనిల్ కుమార్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. సమీప టోల్ ప్లాజాల సీసీ కెమెరాలను పరిశీలిస్తూ మృతుడి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *