– ఉపాధ్యక్షుడిగా నర్ర చంద్రమౌళి, కార్యదర్శిగా ధోని దేవేందర్
పర్వతగిరి: మండలంలోని ఏనుగల్లు గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలక మండలి ఎన్నికలు గురువారం నిర్వహించారు. సంఘం పాలక మండలి కోసం మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా, సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అనంతరం తొమ్మిది మంది పాలక మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో గుండ రాకేష్, నర్ర చంద్రమౌళి, చెట్టబోయిన పెద్దవెంకన్న, తోట కుమారస్వామి, తోట వీరశేఖర్, మొద్దు దేవేందర్, ధోని దేవేందర్, ధోని నరేందర్, హేమ దేవేందర్లు పాలక మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన పాలక మండలి సభ్యుల సమావేశంలో అధ్యక్షుడిగా గుండ రాకేష్, ఉపాధ్యక్షుడిగా నర్ర చంద్రమౌళి, కార్యదర్శిగా ధోని దేవేందర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఏనుగల్లు మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి నూతన పాలకవర్గం ఏర్పడింది. నూతన పాలకవర్గం సంఘం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు మత్స్యకారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సభ్యులు ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, పాలక మండలి సభ్యులకు సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.