ప్రభుత్వ స్టేడియాలు ధనవంతులకే పరిమితం కాకూడదు:

ఫీజుల పెంపును పునఃపరిశీలించి పేద క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి: పుట్టా శంకరయ్య

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • ఖమ్మం: ప్రభుత్వ స్టేడియాల్లో క్రీడా శిక్షణ ఫీజుల పెంపును వెంటనే పునఃపరిశీలించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టా శంకరయ్య ప్రభుత్వాన్ని కోరారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో శిక్షణ అందించాలని సూచించారు.
    గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వస్తున్నారని, అధిక ఫీజుల కారణంగా వారు క్రీడలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడకూడదన్నారు. ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప డబ్బుకు కాదని పేర్కొన్నారు.
    ప్రభుత్వ స్టేడియాల్లో అర్హత కలిగిన కోచ్‌లు, క్రీడా సామగ్రి, మైదానాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని శంకరయ్య కోరారు. క్రీడలను ఆదాయ వనరుగా కాకుండా యువత భవిష్యత్తుపై పెట్టుబడిగా ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ అందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *