మహబూబాబాద్: మహబూబాబాద్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ అనుబంధం) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బానోత్ శంకర్, కార్యదర్శిగా జి. కోటేశ్వరరావు, కోశాధికారిగా భూక్య సర్వన్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా ఆకుల రాజు, ఉపాధ్యక్షులుగా వి. వెంకన్న, భూక్య రాము, ముఖ్య సలహాదారుగా షేక్ యూసుఫ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నల్ల నరసయ్య, రామచంద్రు, బి. వెంకన్న, బి. సురేష్, యాకయ్య ఎన్నికైనట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ నూతన కమిటీ ఎన్నిక
06
Sep