పర్వతగిరి: అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం అధ్యక్షుడిగా సింగారపు రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో యువజన సంఘంలో నూతన ఉత్సాహం నెలకొంది. ఉపాధ్యక్షులుగా అర్షం ఆనంద్, కొయ్యల రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా చిన్నపెల్లి అజయ్, సహాయ కార్యదర్శిగా చిన్నపెల్లి శ్రావణ్, కోశాధికారిగా అర్షం సాయికృష్ణ ఎన్నికయ్యారు. సంస్కృతి విభాగానికి జిల్లా రమేష్, క్రీడల విభాగానికి చిర్ర సునీల్ బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గ సభ్యుడిగా బొట్ల ప్రశాంత్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి, సామాజిక సేవా కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు సభ్యులు తెలిపారు.
అంబేద్కర్ యువజన సంఘంలో కొత్త జోష్.. అధ్యక్షుడిగా సింగారపు రమేష్ ఏకగ్రీవ ఎన్నిక!
06
Sep