గూడూరు మండల పరిధిలో యువతి ఆత్మహత్య…
తొలి సమయం కొత్తగూడ 06 మే 2026
గూడూరు మండలం పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వెంగంపేట గ్రామానికి చెందిన పాల్త్యా తండా నివాసి పాల్త్యా అనుష (19) మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. మృతురాలు కొండయ్య కుమార్తె కాగా, ఆమె షెడ్యూల్డ్ ట్రైబ్ (లంబాడి) వర్గానికి చెందినదని వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు