టిఆర్ఎస్ -కాంగ్రెస్ ల మధ్య దూషణల దుమారం..

టిఆర్ఎస్ -కాంగ్రెస్ ల మధ్య దూషణల దుమారం..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

తొలి సమయం మహబూబాబాద్ మే 7

 

వరంగల్ రైతు సభ తర్వాత కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల దుమారం మొదలైంది, చిలికి చిలికి జనాన్ని రెచ్చగొట్టే వేదికయింది, ఈ దుమారం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. కేటీఆర్ తమ నాయకుడు రాహుల్ గాంధీని దూషించారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయని రాజేందర్ రెడ్డి బుధవారం రాత్రి పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను కలిసి ఫిర్యాదు చేశారు, ఈ మేరకు సుబేదారి పోలీసులు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ణులు కలతో పాటు పోలీస్ శాఖ గుర్రుగా ఉన్నారు.

 

పంచాయతీకి ఆజ్యం రగిలించిన కేటీఆర్ వాక్యలు

మే 6న వరంగల్ లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సభ లో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పై తీవ్రమైన వార్తలు చేశారు. రైతు డిక్లరేషన్ ఉట్టి ఫోకస్ అన్నారు. ఎన్నికల ముందు వరంగల్ కు ఒచ్చి 34 హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ రైతులు ఇబ్బంది పడుతుంటే ఎక్కడ సచ్చావు అంటూ కఠినమైన భాషను ప్రయోగించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ హౌలా, దివానా, ఏం పీకుతున్నావ్ ,కొడుకా నీ కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి సంచులు మూయడం తప్పనీకు ఏం తెలియదు, అంటూ కఠోరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ రాజకీయం వేడెక్కింది, కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ ఘాటు వాక్యులకు దీటైన సమాధానంగా స్పందించారు, గట్టి కౌంటర్ ఇచ్చారు

 

నిప్పులు జరుగుతున్న కాంగ్రెస్

 

సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు నిప్పులు రాజేస్తున్నారు, ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు, బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వాక్యాలను తీవ్రంగా ఖండించాలి అధికారం కోల్పోయిన బలహీన మానసిక స్థితి లో కేటీఆర్ మతి స్థిమితాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు, కేటీఆర్ కుటుంబం మొత్తంగా సోనియాగాంధీ కాళ్లపై పడిన సంఘటనను గుర్తుకు చేస్తూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని తిట్టేస్తాయి నీది కాదని కేటీఆర్ ను అన్నారు, నీ సోదరి కవితమ్మ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పై విరుచుకు పడడం నీ దురుసు స్వభావానికి నిదర్శనం అన్నారు, అంతటితో ఆగని కాంగ్రెస్ నేతలు సుబేదారీ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు, పోలీసులు కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం బిఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది..

 

కాంగ్రెస్ నేతలకు కౌంటర్ గా టిఆర్ఎస్ నేతలు..

 

కేటీఆర్ పై కేసు నమోదు చేయడంపై బిఆర్ఎస్ తప్పు పట్టింది, రాజకీయ విమర్శలకు కేసులు పెట్టడం కాంగ్రెస్ కక్ష సాధింపు చర్య అని టిఆర్ఎస్ నేతలు నిప్పులు చరిగారు, ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం బుధవారంతో ముగిసింది. కొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సింది ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలకు ముందు రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి ఒత్తిడి పెంచేందుకు ఈ వివాదాన్ని వాడుకుంటున్నాయి,అని టాక్ నడుస్తుంది. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ లీగల్ యాక్షన్ తీసుకోవడం టిఆర్ఎస్ దాన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరించడం, తెలంగాణలో సర్వత్ర ఆసక్తికరమైన అంశంగా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *