పొన్నాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహా గణనాథుని నిమజ్జన యాత్ర

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

– దుర్గా నగర్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగిన నిమజ్జన వేడుకలు

– ముఖ్య అతిథులుగా హాజరైన వివిధ పార్టీల నాయకులు, బహుజన ఉద్యమనేతలు

ఉప్పల్: దుర్గా నగర్‌లో పొన్నాల లలిత (ఎక్స్‌ వార్డు మెంబర్) ఆధ్వర్యంలో మహా గణనాథుని నిమజ్జన యాత్రను ఘనంగా నిర్వహించారు. పొన్నాల మహేందర్ ఆధ్వర్యంలో సాగిన యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తుల సందడితో దుర్గా నగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా మంద కార్తిక్ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో కేశపాక రామచందర్, ఎంఎస్‌పీ జాతీయ నాయకులు, మేడ్చల్ ఇన్‌చార్జి కొరాపాక అంజి మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఇటుక కిషన్, హైదరాబాద్ ఇన్‌చార్జి, మల్లికార్జున్ గౌడ్,టేకులపల్లి రామచందర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు,దళిత రత్న అవార్డు గ్రహీతలు సీనియర్ జర్నలిస్టులు ఏళ్ల సంతోష్ కుమార్, ఇడపాక సురేష్, సీనియర్ జర్నలిస్టులు ఎం చిరంజీవి, శివ అద్వైత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *