గిరిజన తండాలో క్షుద్ర పూజల కలకలం..!

డోర్నకల్: మండల పరిధిలోని పకీరతండా గ్రామంలో క్షుద్ర పూజలు చేశారంటూ వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తమ నివాస ఆవరణలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గురువారం ఉదయం నిద్రలేచి చూడగా ఇంటి ముంగిట నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తెల్లగుడ్డ, నవధాన్యాలు, ఇతర వింత వస్తువులు కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న బ్లూ కోర్ట్ సిబ్బంది షేక్ అశ్వక్, పతంగి సంపత్ ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. చేతబడులు, క్షుద్ర పూజల పేరుతో భయపెట్టడం వంటివి నమ్మవద్దని, కొందరు కావాలనే ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని కౌన్సెలింగ్ ఇచ్చారు.

అనంతరం పోలీసు సిబ్బంది స్వయంగా అక్కడ ఉన్న అనుమానాస్పద వస్తువులు, పూజా సామగ్రిని తొలగించి గ్రామానికి దూరంగా పారవేయించారు. పోలీసుల సమయస్ఫూర్తితో స్పందించి బాధితులకు ధైర్యం చెప్పడంపై తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *