ప్రేమ పేరుతో మోసం.. గర్భిణీ యువతి బలవన్మరణం

మహబూబాబాద్ జిల్లా, సెప్టెంబర్ 3: ప్రేమ పేరుతో మోసపోయానన్న మనస్తాపంతో ఓ గర్భిణీ యువతి బలవన్మ రణానికి పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బండి మౌనిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. యువతి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం.. నల్లెల్ల గ్రామానికి చెందిన బండి మౌనికకు అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌తో గత నాలుగేళ్లుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీకాంత్.. మౌనిక గర్భం దాల్చిన అనంతరం పెళ్లికి నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి, మౌనిక–శ్రీకాంత్‌ల వివాహానికి పరిష్కారం చూపేందుకు ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మౌనిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ఇతర వ్యక్తుల పాత్రపైనా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి లభించే ఆధారాలు, దర్యాప్తులో వెలుగుచూసే అంశాల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీరోల్ ఎస్‌ఐ సంతోష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *