జాతీయ స్థాయిలో, క్రీడాల్లో మెరిసిన డోర్నకల్ బిడ్డ

జాతీయ స్థాయిలో, క్రీడాల్లో మెరిసిన డోర్నకల్ బిడ్డ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

త్రోబాల్‌లో ప్రతిభ కనబరిచిన తల్లూరి హరి చందన

తొలి సమయం ​మాహబూబాబాద్ మర్చి 20:

తెలంగాణ రాష్ట్ర మహిళా త్రోబాల్ జట్టు జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మకమైన ఫెడరేషన్ కప్ జాతీయ త్రోబాల్ పోటీల్లో తెలంగాణ జట్టు రన్నరప్ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన తల్లూరి హరి చందన జట్టులో కీలక పాత్ర పోషించిన ఆమె పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.
​పట్టుదలతో పతకం సాధించి
​రాష్ట్ర జట్టులో సభ్యురాలిగా ఎంపికైన హరి చందన, క్రీడా మైదానంలో ఎంతో ఏకాగ్రతతో, పట్టుదలతో ఆడి జట్టు రన్నరప్‌గా నిలవడానికి తన వంతు కృషి చేశారు. జాతీయ స్థాయి వేదికపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేయడమే కాకుండా, తన సొంత గ్రామమైన ఉయ్యాలవాడకు మరియు డోర్నకల్ మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. దివంగత నేత ​తాల్లూరి బాబు మనవరాలు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు తాల్లూరి గంగాధర్ కుమార్తె అయిన హరి చందన సాధించిన ఈ విజయంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆమె ప్రతిభను గుర్తించి స్థానిక నాయకులు నున్న రమణ, నజీర్ పాషా, వంకాయలపాటి రామారావులతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

*​గ్రామంలో ప్రశంసల వెల్లువ*
​రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే తన ముద్ర వేసిన హరి చందన, రాబోయే రోజుల్లో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని బహుమతులు సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డోర్నకల్ ప్రాంత ప్రజలు దీవెనలు ఇచ్చారు
​ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం ఎంతో గర్వకారణం అన్నారు హరి చందన భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఉయ్యాలవాడ గ్రామస్తులు కోరుతున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *