.చదువు మధ్యలోనే.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య…

చదువు మధ్యలోనే.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం, డెస్క్ హైదరాబాద్

మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న నందిని ఆత్మహత్య చేసుకుంది.

నారపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో తన గదిలో ఉరేసుకొని ఆమె మృతి చెందింది. హాస్టల్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతురాలు నందిని సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *