నూతన సంవత్సర ము ప్రపంచ శాంతి కి నాంది కావాలి
-సంకె పల్లి శ్రీనివాస రెడ్డి
–
తొలి సమయం మహబూబాబాద్ మర్చి 19:
నూతన సంవత్సర ము ప్రపంచ శాంతికి నాంది కావాలి అని శుభోదయం సాహిత్య, సాంస్కృతిక మరియు సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు సంకెపల్లి శ్రీనివాస రెడ్డి కోరారు. స్థానిక బ్యాంక్ కాలని లోని సంస్థ ప్రధాన కార్యాలయం లో “శ్రీ పరాభవ నామ సంవత్సర ము “సందర్బంగా ఉగాది కవి సమ్మేళ నము ” సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించి మాట్లాడు తూ కుల, మత, ప్రాంతీయ మరియు జాతి విద్వేషాలు లేకుండా ప్రపంచ ప్రజలు అయిక మైత్యము తో కలిసి జీవించాలి అని కోరారు. పాలకుల నియంతృ త్వ, పాషవిక పోకడ లకు వ్యతిరేకం గా పోరాడాలి అని కోరారు. ప్రపంచ శాంతి అందరి లక్ష్యం కావాలి అని కోరారు కవితా గానం చేసిన కవుల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో సంకెపల్లి కీర్తనా రెడ్డి, శ్రావిక, బొడ్ల వెంకటయ్య అమర్నాథ్, అజీ జ్ ఖాన్, మాధవరపు నాగేశ్వర్ రావు. నరేష్, రవీందర్, బొడ్డుపల్లి పాపయ్య, రేణికుంట్ల లక్ష్మి కాంతారావు, బాణాల వీరయ్య, శంకర చారి, బొల్లోజు భరత్, శ్రీపాద సంతోష్ పాల్గొన్నారు.