ఎల్ఐసి ఉద్యోగి పులి హనుమంతు (బాబు )మృతి..
తొలి సమయం మహబూబాబాద్ ఫిబ్రవరి 26:
జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి ఉద్యోగి పులి హనుమంతు బాబు మృతి చెందారు, ఆల్ ఇండియా ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ అసోసియేషన్ 20 సంవత్సరాలుగా సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు,అతని భార్య పులిపద్మ గిరిజన సంక్షేమ హాస్టల్ లో వార్డెన్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అతనికి ఇద్దరు కుమారులు,1) కార్తికేయ 2)రేవంత్ బాబు,నాయక పోడు సామాజిక వర్గానికి చెందిన హనుమంతు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ గత 20 సంవత్సరాల నుండి సేవ చేస్తూ.. అసోసియేషన్ వేదికగా అనేకమంది ఆదివాసి అర్చరీవిద్యార్థి క్రీడాకారుల క్రీడాభ్యున్నతికి మృతులు హనుమంత్ సేవలు చేసారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు సాదుల సారంగపాణి( ఏసీపీ ), కార్యదర్శి పుట్ట శంకరయ్య స్పోర్స్ ఆఫిసర్ (రిటైర్డ్) మృతుని కుటుంబానికి తీవ్రమైన దిగ్బ్రాంతితో కూడిన సానుభూతిని తెలియ జేశారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ తరపున మౌనం పాటించి నివాళ్లు అర్పించారు, కంబాల పెళ్లి 10వ తరగతి హై స్కూల్ క్లాస్ మేట్స్ మరియు తొలి సమయం ఎడిటర్ v. అయోధ్య రాములు హనుమంత్ కు అత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళ్లు అర్పించారు