మహబూబాబాద్ 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ముప్పేట వ్యూహరచన

మహబూబాబాద్ 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ముప్పేట వ్యూహరచన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కాంగ్రేస్ పార్టీలో వార్డు ఓటర్లు భారీ చేరిక

అభ్యర్థి బాలుచౌహన్ శాసన సభ్యులు డాక్టర్ మురళీ నాయక్ ఇంటింటా ప్రచారం…

తొలి సమయం మహబూబాబాద్ ఫిబ్రవరి 4:

మహబూబాబాద్ మునిసిపల్ 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడ్ బాలు చౌహన్ గెలుపును లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు చోటుచేసుకున్నాయి.
ఎమ్మెల్యే డా.మురళి నాయక్ ఆధ్వర్యంలో చేరికలుజరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మాజీ డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి హాజరై, పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీకు చెందిన వారు కాంగ్రేస్ లో చేరడం ఓ ప్రత్యేకత గా నిలిచింది, 17వ వార్డులో బాలు చౌహన్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బానోత్ వీరన్న నాయక్, పోతురాజు కొమరయ్య, గాడి పెళ్లి సతీష్, లునావత్ కృష్ణ, దొంతు శ్రీనివాస్, మాలోత్ సంతు జాదవ్, చుంచు మల్లేష్ యాదవ్, యం.డి. పాషా, భూక్య బిచ్చు, ఏర్పుల లింగన్న, బుక్య లాలు, గుగులోత్ వెంకన్న, అంగోత్ లక్ష్మణ్, వాంకుడోత్ రమేష్, అంగోత్ అశోక్, బోడ వెంకటేశ్వర్లు, గుగులోత్ సిద్ధు, బానోత్ వీరన్న, అంగోత్ సంతోష, బానోత్ సునీత, గుగులోత్ సౌందర్య, భూక్య సునీల్, భూక్య శేవరీ, అజ్మీర అరుణ, బానోత్ లక్ష్మీ, బోడా శిరీష, తాళ్లపల్లి భారతి, భూక్య సుగుణ, బాదావత్ కమిలి, బానోత్ సుజాత, భానోత్ మమత, మనిషా, బోడా కమల, గుగులోత్ దేవిషి, బానోత్ జ్యోతి, అంగోత్ మాలతి, వాంకుడోత్ బుజ్జి, తేజవత్ అఖిల్, నాగవెల్లి మానస, మాలోత్ పార్వతి, విసంపల్లి గొడుగు సైదులు, బొల్లికొండ అయోధ్య, దేవత్ మంజునాథ్, బానోత్ వసరామ్, బానోత్ వెంకన్న, భానోత్ వివేక్, కొత్త శ్రీనివాస్, వాంకుడోత్ గణేష్, భానోత్ నరేష్, నాగవెల్లి శ్రీశైలం, వి. మధు, బోడా మోహన్, పర్సు శీను, ఎండి. చాంద్ పాషా తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మురళి నాయక్ మాట్లాడుతూ,
“గత బీఆర్‌ఎస్ పాలకులు మునిసిపల్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మునిసిపాలిటీలకు నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు ప్రారంభించింది అన్నారు అదే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని పేర్కొన్నారు.
భరత్ చంద్ రెడ్డి మాట్లాడుతూ, 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైంది. ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలన కోరుకుంటున్నారుఅన్నారు. ఆశలను నెరవేర్చగల నాయకుడు బాలు చౌహన్” అని అన్నారు. అభ్యర్థి మూడ్ బాలు చౌహన్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 17వ వార్డును సమగ్ర అభివృద్ధికి మాదిరిగా తీర్చిదిద్దుతానని, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ చేరికలతో 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగిందని అన్నారు, రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో బాలు చౌహన్ విజయం ఖాయమని స్థానిక నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *