మునిసిపాలిటీ ఎన్నికల దృష్ట్యా టౌన్ పోలీస్ స్టేషన్ లో 20 మంది రౌడీ షీటర్స్ బైండోవర్…
వ్యక్తి గత షూరిటీ తో విడుదల చేసిన స్థానిక ఎమ్మార్వో
—- టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి
తొలి సమయం మహబూబాబాద్ ఫిబ్రవరి 4:
మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు డి.ఎస్.పి తిరుపతిరావు సూచనల ప్రకారం టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి 20 మంది రౌడీ షీట్లను మహబూబాబాద్ ఎమ్మార్వో సమక్షంలో బైండోవర్ చేశానని జిల్లా కేంద్రంలో టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తెలిపారు.. ఈ సందర్భంగా సిఐ గట్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలని షరతులు పెట్టమని, వారు జాగ్రత్త వహించాలని అన్నారు, వారినుండి వ్యక్తిగత షూరిటీ తీసుకొని ఎమ్మార్వో విడుదల చేశారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్సై సిహెచ్ అరుణ్ కుమార్ పి ప్రశాంత్ బాబు ఎస్కే షఖీర్ మౌనిక, ఎండి అలీమ్ హుస్సేన్ యూస్ సూరయ్య బ్లూ కోల్స్ సిబ్బంది పాల్గొన్నారు,