గిరిజన క్రీడావకాశాలపట్ల తెలంగాణా ప్రభుత్వం ఉదాసీనత సరికాదు..
క్రీడాశాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఉదాసీనత వైఖరితో క్రీడాకారులకు నష్టం..
కే లో ఇండియా ట్రైబల్స్ గేమ్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గిరిజన క్రీడాకారులకు
ఇస్తున్న సదావకాశాన్ని సద్వి నియోగం చేస్తూ.వెంటనే ఎంపిక పోటీలు నిర్వహించాలి..
జాతీయ ఆర్చరి అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ పుట్ట శంకరయ్య
తొలి సమయం, మహబూబాబాద్ జనవరి 26:
రాష్ట్రంలోని క్రీడా శాఖ గిరిజన సంక్షేమ శాఖలు గిరిజన క్రీడాకారులకు కే లో ఇండియా ట్రైబల్స్ గేమ్స్ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించుటకు 8 సంవత్సరాల వరకు ప్రతి ఏటా 5 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించనుంది ఇది గిరిజన క్రీడాకారులకు గొప్ప అవకాశం. ఏడు క్రీడాంశాలలో హాకీ ఫుట్బాల్ స్విమ్మింగ్ వెయిట్ లిఫ్టింగ్ అతర్టిక్స్ ఆర్చరీ రెజ్లింగ్ క్రీడల్లో ఈ నెల 27వ తేదీ లోపు ఈ పోటీలు నిర్వహించాలి జాతీయస్థాయి గిరిజన ఖేలో ఇండియా పోటీలు వచ్చే నెలలో చత్తీస్గడ్ రాష్ట్రంలో జరగనున్నాయి దురదృష్టవాశాత్తు రాష్ట్రంలోని క్రీడా శాఖ గిరిజన సంక్షేమ శాఖలో ఈ కార్యక్రమం పట్ల నిర్లక్ష్య వైఖరి ఆలోచిస్తున్నా అని ఆశ్చర్య అసోసియేషన్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ కమిటీ మెంబర్ పుట్ట శంకరయ్య ఓ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.. ఇది గిరిజన క్రీడాకారులకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారులు వెంటనే స్పందించి ఎంపిక పోటీలను నిర్వహించాలి అని అన్నారు