జిల్లాల జోలికి వస్తే జగన్ పట్టిన గతి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి లకు పడుతుంది..

జిల్లాల జోలికి వస్తే జగన్ పట్టిన గతి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి లకు పడుతుంది..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా హడావుడి శిలాపలకాలు..

తొలి సమయం మహబూబాబాద్ జనవరి 13:

జిల్లాల జోలికొస్తే మానుకోట జిల్లా కేంద్రంలో జగన్ కు పట్టిన గతి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పడుతుందని మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల గురించి అవగాహన లేదన్నారు, ఇష్టా రీతిగా మాట్లాడడం సరికాదన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా రేవంత్ రెడ్డి పాలన ఉన్నదని ఎద్దేవా చేశారు, మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా హడావుడిగా అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ నాయకుల మాటలు వినే స్థితిలో లేరని రాతోడ్ సత్యవతి అన్నారు
అనంతరం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానంచే చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ మాలోత్ కవిత మహబూబాబాద్ మాజీ శాసన, సభ్యులు భానోత్ శంకర్ నాయక్ మాజీ జడ్పీ చైర్మన్ కుమారి ఆంగోత్ బిల్లు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ పిఏసిఎస్ మాజీ చైర్మన్ రంజిత్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గద్దె రవి ముత్యం వెంకన్న బోడ శ్రీను నాయక్ కత్తుల ఎలేందర్ బాలు, మరియు మహిళ నేతలు ఇతరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *