పారిశ్రామిక వాడ కోసం మంత్రి పొంగులేటికి వినతి పత్రం ఇచ్చిన డిజిల్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ…

పారిశ్రామిక వాడ కోసం మంత్రి పొంగులేటికి వినతి పత్రం ఇచ్చిన డిజిల్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— నిర్మాణాల కోసం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి

తొలి సమయం మహబూబాబాద్ జనవరి 13:

పారిశ్రామిక వాడ ( ఆటోనగర్) కోసం కోసం స్థలం కేటాయించుతూ నిర్మాణాల కోసం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, పట్టణ డిజిల్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంత్రి రెవెన్యూ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు
ఈ సందర్భంగా వెల్ఫేర్ సొసైటీ ఇచ్చిన వినతిపత్రం ప్రకారంగా… జిల్లా కేంద్రం అభివృద్ధి చెందింది. జనాభా తక్కువ ఉన్న కాలంలో. రూములు, తక్కువ రేటుకు కిరాయి ఇచ్చేవారు, జనాభా పెరిగిన దృష్ట్యా రిపేరింగ్ చేసుకునే స్థలాలు రూముల కిరాయి పెంచారు. గత 40 సంవత్సరాల నుండి వివిధ సెంటర్లలో డీజిల్ మరియు పెట్రోల్ తో నడిచేటువంటి ట్రాక్టర్లు లారీలు బస్సులు, కార్లు జీపులు మరియు ఇతర వాహనాలు ఎలక్ట్రిషన్ బ్యాటరీ వర్క్స్ పై ఆధారపడి జీవిస్తున్న మాకు కడు ఇబ్బందులు ఎదురవుతున్నారు. పేదవాళ్ల మైన మాకు యజమానులు రూములు కిరాయికి ఇవ్వడం లేదు, మాకు సొంత ఇండ్లు గాని స్థలాలు గానీ లేవు, రోడ్డుపైన వాహనాలు రిపేరు సంబంధిత పనులు చేయడం వలన పోలీసు వారు పొల్యూషన్ అవుతుందని అభ్యంతరాలు తెలుపుతున్నారు. మున్సిపాలిటీ వారు కూడా ఇబ్బంది పెడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ కోసం పలు వినతి పత్రాలు ఇచ్చాము, కావున అన్ని జిల్లాలలో మాదిరిగా మానుకోటలో కూడా ఆటోనగర్ లేదా పారిశ్రామిక వాడ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించుతూ… నిర్మాణాల కోసం వడ్డీలు లేని రుణాలు ఇప్పించి ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో డీజిల్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఎడబోయిన శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్ డి రహీం, కోశాధికారి ఏకే రాము, గౌరవ అధ్యక్షులు,సయ్యద్ నిజాముద్దీన్ ఉపాధ్యక్షులు జావిద్ సంస్థ సలహాదారులు కృష్ణ వీరేందర్ వెంకటేశ్వర్లు నరేష్ ముస్తఫా, మధు నరసింహ యాకుబ్ పాషా వెంకటేష్ ఎస్కే కాజమొహిద్దిన్ రవి యాక్స నాయక్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *