సంక్రాంతి పండుగ వేళ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఇల్లందు సీఐ టి సురేష్.
తొలి సమయం, ఇల్లందు;
జనవరి, 12.
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. పండుగ సెలవుల సమయంలో ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే వారు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విలువైన నగలు, నగదు ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని తెలిపారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
పండుగ సందర్భంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టణాలు, గ్రామాల్లో పెట్రోలింగ్‌ను పెంచడంతో పాటు, ఖాళీ ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలు సహకరిస్తే దొంగతనాలను పూర్తిగా నివారించవచ్చని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.