దేశ అభివృద్ధి, నిర్మాణం లో యువశక్తిదే ముఖ్యమైన రోల్..
న్యాయవాదులు తమ వృత్తిలో అంకితభావం కలిగి ఉండాలి..
—వివేకానందుని బోధనలు యువతకు మార్గదర్శ
—- అదనపు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అర్వపల్లి కృష్ణతేజ్—
— స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువశక్తి లీగల్ ఎక్స్లెన్సీ అవార్డుల ప్రధానం
—- న్యాయవాది పరిషత్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు,
పరిషద్ జిల్లా అధ్యక్షుడు నలుసాని ప్రభాకర్ రెడ్డి
తొలి సమయం మహబూబాబాద్, జనవరి 12 :
న్యాయవాది పరిషత్ మహబూబాబాద్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నలుసాని ప్రభాకరెడ్డి అధ్యక్షతన శ్రీ స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని మహబూబాబాద్ బార్ అసోసియేషన్ హాలులో ఘనంగా నిర్వహించి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా యువతను ప్రోత్సహించడం, వారిలో స్ఫూర్తి నింపడం కోసం యువ న్యాయవాదులు వాసం ఆనంద్ కుమార్,దర్శనం రామకృష్ణ ,బస్కే మధు, కాసాని మౌనిక,మణికొండ ప్రవీణ,గుగులోత్ సునీత లకు”*యువ శక్తి–లీగల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026* అవార్డ్స్ ముఖ్య అతిథి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏ. కృష్ణ తేజ, అతిథులు బార్ అసోసియేషన్ అద్యక్షుడు ఏ. ప్రేమచందర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, కేంద్రప్రభుత్వ న్యాయవాది తుంపిల్ల శ్రీనివాస్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఆరెల్లి శ్రీనివాస్ లు ప్రధాన చేసి ఘనముగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏ. కృష్ణ తేజ మాట్లాడుతూ దేశ నిర్మాణం, అభివృద్ధి , దేశపురోగతి యువత సహకారంపై ఆధారపడి ఉంటుంది. దేశాభివృద్ధిలో యువశక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అటువంటి యువజన సమూహం యొక్క శక్తి , సామర్థ్యాన్ని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేసినది స్వామి వివేకానంద అని అన్నారు.
గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని , యువతకు స్ఫూర్తి. యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమని భావించిన వివేకానంద ఆలోచనలతో యువతను ఏకం చేయాలన్నారు. ఈ కార్యక్రమములో న్యాయవాది పరిషత్ ఉపాధ్యక్షుడు గాదె కమల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పుల్లఖండం శ్రీనివాస స్వామి,కోశాధికారి పిన్ని రాము, న్యాయవాదులు డేగల సత్యనారాయణ, దూదిమట్ల మహేందర్, ఊడుగుల హరికృష్ణ, కొర్ర మున్నా, తొణుకునూరి సైదులు, బి.లాలూ, టి.సునీత, ఉడుగుల రాజ్ కృష్ణ, బి.శ్రీనివాస్, కట్కూరి శ్రీనివాస్, సునీత, బొద్దుల దేవి, బి. బాలాజీ , సుమన్, భూక్యా సురేష్ , పి.ఉమామహేశ్వర్ రావు, చిట్యాల నరేష్, చల్లా అశోక్, జరుపుల సురేష్, ఉగ్గుల అశోక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.