హైదరాబాద్‌లో మరో యువతి హత్య
బోరబండ సమీపంలో యువతి హత్య – పరిచయమే ప్రాణాంతకమైంది*
తొలి సమయం డెస్క్ హైదరాబాద్ జనవరి 12:
హైదరాబాద్ నగరంలో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండ సమీపంలో ఒక యువతిని యువకుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
గతంలో బంజారాహిల్స్ సమీపంలోని ఒక పబ్‌లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల ఆ యువతి ఊర్వశి బార్‌కు షిఫ్ట్ కావడంతో యువకుడిని పట్టించుకోవడం తగ్గిందని భావించిన అతడు తీవ్ర కోపానికి లోనయ్యాడు.
మాట్లాడదామని చెప్పి యువతిని పిలిచిన యువకుడు, అక్కడే ఆమెపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.