గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటాం ప్రజలకు అండగా ఉంటాం
సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే షాబీర్ పాషా
రాఘవాపురం గ్రామంలో ప్రజా చైతన్య సభ
ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా
సుజాతనగర్ తొలి సమయం జనవరి 8
ఈరోజు రాఘవపురం గ్రామంలో ఎన్నడూ లేనివిధంగా రాఘవపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వార్డు మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయినా కూడా తమకి ఓట్లు వేసిన ప్రజలకు అండగా ఉంటాం అంటూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రజా చైతన్య సభను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సభ యొక్క ముఖ్య అతిథి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ఎస్.కె షాబీర్ పాష మాట్లాడుతూ సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉషా కృష్ణ లకు మరియు వార్డు మెంబర్లకు మద్దతిచ్చిన మిత్రపక్షాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని భవిష్యత్తులో రాఘవపురం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటామని గెలిచిన ఓడిన ప్రజల్లోనే ఉండి ప్రజలకు సేవ చేస్తామని మన ప్రియతమ నాయకులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి కోమారి హనుమంతరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్య దసురు జిల్లా కౌన్సిల్ మెంబర్స్ జక్కుల రాములు తాళ్ల వెంకటేశ్వరరావు సిపిఐ మండలం నాయకులు ఆకుల వెంకన్న దొడ్డ వెంకన్న మూడు గణేష్ దండు సురేష్ వీర్ల మల్లేష్ గడ్డం రాజేందర్ కళ్లెం శ్రీను నాలం సారయ్య మాచర్ల నరసింహారావు సిపిఎం నాయకులు మద్దిబోయిన గోవర్ధన్ మురిపిటి రాములు టిఆర్ఎస్ నాయకులు గరిక నాగేంద్ర చిమట అప్పారావు ఎనుముల చిట్టయ్య జలగం యువసేన నాయకులు దొంచరపు శ్రీనివాస్ మొగిలి సతీష్ మద్దిబోయిన నరసింహారావు బిజెపి నాయకులు చేతుల శంకర్ బీఎస్పీ నాయకులు గుండేటి ఆది మరియు గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు