*కులాలు, వర్గాల కతీతంగా మత్స్యశాఖ సహకార సంఘం అభివృద్ధి చెందాలి*
నూతన గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో
మేకల మల్లి బాబు యాదవ్, దనియాకుల హనుమంతరావు.
తొలి సమయం, పండితాపురం;
జనవరి, 08.
రాజకీయాలు కులాలు వర్గాలకతీతంగా గిరిజనులు గిరిజనేతరులు ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఆర్థికంగా బలోపేతం కావాలని మాజీ జెడ్పిటిసి, మాజీ డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ పిలుపునిచ్చారు.
కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలోని కొండాయిగూడెం మత్స్య శాఖ సహకార సంఘంలో నూతనంగా గిరిజనులు సభ్యత్వం తీసుకున్నారు. ప్రభుత్వం వారిచే జారీ చేయబడిన సభ్యత్వ కార్డులు పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. తదనంతరం మత్స్యశాఖ సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జున రావు అధ్యక్షతన జరిగిన పంపిణీ కార్యక్రమంలో మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు ధనియా కుల హనుమంతరావు తో పాటు పాల్గొన్న మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ఏరియా ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం మత్స్యశాఖ సంఘంలో 207మంది గిరిజనులను సభ్యులుగా చేర్చుకోవడం జరిగిందని, వారంతా ఐటిడిఏ, మత్స్య శాఖ ద్వారా చేపలు పట్టడం వల విసరడం మార్కెటింగ్ చేయడం లాంటి వాటిని నేర్చుకోవడం జరిగిందని, అదేవిధంగా ప్రతి సంవత్సరం చెరువులలో చేప పిల్లల పోసి పెంచుకోవాలని, దీనికోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అనేక రాయితీలు, భీమా సౌకర్యం, కల్పించిందని, కులాలు తెగలు, బేధాభిప్రాయాలు లేకుండా సంఘం సభ్యులంతా ఒక కుటుంబం లాగా ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని శ్రీను, సంఘం ప్రధాన కార్యదర్శి బండి నాగేశ్వరరావు, డైరెక్టర్లు అయితనబోయిన వీరభద్రం, తురక బిక్షం, చల్ల పెద్ద నాగయ్య, చల్ల నరసింహారావు బండి బేగయ్య, చల్ల మల్లయ్య బానోతు లక్ష్మ, ధరావత్ లాలు అయితనబోయిన విటల్ రావు, శీలం పుల్లయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు అయితనబోయిన నాగేశ్వరరావు ధర్మ సోత్ కిషన్, ధర్మ సోత్ నాగేశ్వరరావు, భానోత్ వీరన్న బానోతు కిషన్ మరియు తదితరులు పాల్గొన్నారు.