లంబాడీలు ఎస్టీలు కాదుని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి…
*—-పార్లమెంట్ నియమించిన అన్ని కమిటీల నివేదికల ప్రకారం లంబాడిలు ఎస్టీలు కాదు… మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు *
*అలాగే ఆదివాసి తెగల సంస్కృతి పరిరక్షణ, దేవతల క్షేత్రాల అభివృద్ది మరియు ఆధ్యాత్మిక ట్రైబల్ టూరిజం కోసం ” ఆదివాసీ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి”
— చుంచు రామకృష్ణ DE, ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్
తొలి సమయం డెస్క్ హైదరాబాద్ జనవరి 8:
మాజీ ఎంపీ, ఆదివాసీ తెగల ఉద్యమ నేత, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు *సోయం బాపూరావు నేతృత్వంలో గురువారం ఆదివాసీ తొమ్మిది తెగల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు చుంచు రామకృష్ణ, ఆధార్ సొసైటీ ట్రెజరర్ మెట్ల పాపయ్య రిటైర్డ్ సి ఇ, ఆదివాసీ అడ్వకేట్ అసోసియేషన్ న్యాయవాదులు అరెం పాపారావు, వాసం ఆనంద్ లు కలిసి ఈరోజు ఢిల్లీలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యుయల్ ఒరం, సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే గారిని కలిశారు* తెలంగాణ రాష్టంలో ఎన్నో యేండ్లుగా 1976 ఎమర్జెన్సీ కాలం నుండి ఎస్టీలుగా చలామణి అవుతున్న లంబాడీలు రాజ్యాంగం గుర్తించిన ఎస్టీలు కాదని,ఈ విషయంపై తాము ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, ఎన్నో సార్లు రుజువులతో సహా నివేదికలు అందజేశామన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ త్వరగతిన పూర్తి అయితే నిజమైన ఆదివాసీ ప్రజలకు దక్కాల్సిన విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగు న్యాయం జరుగుతుందన్నారు. *ఆర్టికల్ 342 (1) ప్రకారం చట్టభద్దత లేని లంబాడిలను ఎస్టీ జాబితాలో కలపలేదని, దానికి సంబందించిన ఆధారాలను, పార్లమెంట్ కమిటీల నివేదికలను కేంద్ర మంత్రులకు మళ్లీ కొత్త సంవత్సరంలో అందజేశామన్నారు*
అలాగే తెలంగాణ రాష్ట్రంతో పాటు , మధ్య భారతంలోని 5 వ షెడ్యూల్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ,ఒడిస్సా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నివసిస్తున్న ఆదివాసీ తెగల సంస్కృతి పరిరక్షణ కోసం, ఏజెన్సీలో కనీస మౌలిక సదుపాయాలు లేని ఆదివాసీ తెగల ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ది కోసం, గోదావరి, ఇంద్రావతి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను, ప్రకృతి జలపాతాలను కలుపుతూ ఆధ్యాత్మిక ట్రైబల్ టూరిజం ఏర్పాటు కోసం ఆదివాసి నిరుద్యోగ యువతను భాగస్వామ్యం చేయాలని కోరుతూ వీటికి సంబంధించిన నివేదికలను కేంద్ర మంత్రులు శ్రీ జ్యూయల్ ఓరం గారిని, సహాయ మంత్రి శ్రీ ఊకె దుర్గాదాస్ గారిని కలిసి ఆదివాసీ బృంద సభ్యులు అందచేశారు..
*తదనంతరం ఈనెల 20వ తేదీన సుప్రీంకోర్టు బెంచ్ మీదకు వచ్చే కేసు పురోగతిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అల్లంకి రమేష్ గారితో పాటు రికార్డ్ ఆన్ అడ్వకేట్ అరుణా గుప్తా, అడ్వకేట్ సయ్యద్ నక్వీ గార్లతో చర్చించి రాబోయే రోజుల్లో వ్యవహారించాల్సిన విషయాలపై చర్చించారు*
ఈ సందర్భంగా అడ్వకేట్ గారి సూచనల మేరకు త్వరలో ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జంతర్ మంతర్ వద్ద ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 1000 మంది ఆదివాసీ 9 తెగల ప్రతినిధులతో ధర్నా కార్యక్రమం నిర్వహణతో పాటు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆదివాసులతో భారీ సాంస్కృతిక ధర్మ యుద్ధం సభ నిర్వహించడానికి కావలసిన కార్యాచరణపై అన్ని ఆదివాసీ తెగల నాయకులతో చర్చించి తేదీలు త్వరలో ఖరారు చేస్తామన్నారు.