క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన నూతన సర్పంచ్

తొలి సమయం, ఇల్లందు : ఇల్లందు మండలం, సుదిమల్ల గ్రామపంచాయతీ, కొత్తూరు గ్రామంలో, కొత్తూరు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి, టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన నూతన సర్పంచ్ కుంజ సుగుణయ్య. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు ఆరోగ్యకరమైన జీవన శైలిలో ముఖ్యమైన భాగం, ఇవి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతాయని విద్యార్థులకు శారీరక, మానసిక, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *