నిబంధనలు పాటించి ప్రమాదాలు అరికట్టాలి.

నిబంధనలు పాటించి ప్రమాదాలు అరికట్టాలి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం పెబ్బేరు జనవరి 6

రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పెబ్బేరు మండల పరిధిలోని వై శాఖాపూర్ ప్రగతి విద్యాలయంలో మోటార్ వెహికల్ఇన్స్పెక్టర్వాసుదేవరావుగారు అవగాహన సదస్సు నిర్వహించారు.kస్కూల్ బస్సులు కండీషన్లో ఉండేవిధంగా చూసుకోవాలి.
డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ చూడడం, మందుతాగి నడపడం, నిద్రమత్తులో నడపడంవల్ల ప్రమాదాలు జరుగుతాయని ఎంవిఐ వాసుదేవరావుగారు అన్నారు.
డ్రైవర్లు వీటన్నింటికి దూరంగా ఉండి, జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు.ద్విచక్ర వాహనం నడిపేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు.
కార్లు నడిపేవాళ్ళు విధిగా సీటు బెల్ట్ ధరించాలన్నారు.
కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఇట్టి కార్యక్రమాన్ని విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి
రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ఆయన చెప్పారు.
ముఖ్యంగా స్కూల్ బస్సులు ఫిట్ నెస్ విషయంలో రాజీపడకూడదన్నారు.
ఈ సందర్బంగా పిల్లలు, స్కూల్ సిబ్బంది, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలోవాసుదేవరావుగారితోపాటు అధికారులు, స్కూల్ కరస్పాండెంట్ భీంసాగర్,సిబ్బంది మరియు గ్రామ ఉపసర్పంచ్, మాజీ ఎంపిటిసి సత్యంసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *