మున్సిపాలిటీ రెండవ వార్డు పట్టించుకొనే నాథుడేలేరు*

*మున్సిపాలిటీ రెండవ వార్డు పట్టించుకొనే నాథుడేలేరు*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నిత్యం రద్దీగా ఉండే తొర్రూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ ఎదురు దారి

తొలి సమయం తొర్రూరు జనవరి 6

తొర్రూరు కంటే పాలెం రోడ్డు ఎదురుగా మెయిన్ రోడ్డులో సీసీ రోడ్డు మధ్యలో జాయింట్ లీకై మిషన్ భగీరథ మెయిన్ పైప్ నుండి గత కొన్ని రోజులుగా త్రాగునీరు వృధాగా పోతుంది.
గత కొంత కాలంగా రోజుల తరబడి మంచినీళ్లు సరిగ్గా సరఫరా చేయకపోవడంతో ఈ వైపు గృహస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి వృధాగా పోతున్న స్థితిని అరికట్టి ప్రజలకు మేలు చేయాలని పలువురు గృహ వాసులు అంటున్నారు.
దీంతో ఈ రోడ్డు గుండా వచ్చిపోయే బాటసారులు, అయ్యప్ప గుడికి వచ్చే భక్తులు, స్కూల్లకు వెళ్ళే వారు, పిల్లలు, గృహవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి మాటేమిటో గానీ, ఉన్న సౌకర్యాలను ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అనుకూలంగా వినియోగిస్తే బాగుంటుందని ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *