బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోండి :  వీణ సెబాస్టియన్

జూలూరుపాడు మండల అధికారులు స్పందించకపోతే కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేస్తాం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జూలూరుపాడు మండల పరిధిలోని గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. మండలం లోని ప్రతి గ్రామంలో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతోండడంతో యువత మత్తులో జోగుతున్నారు. మద్యం బెల్టు షాపులను తొలగించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మండలంలోని గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు 24గంటలు మద్యం అమ్మకాలు చేయడంతో గొడవలు పెరగడంతో పాటుగా ఆర్థిక పరంగా కూడ నష్టపోతున్నారని బీసీ జిల్లా నాయకురాలు వీణ సెబాస్టియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మందుబాబులు తెల్లవారుజాము నుంచే బెల్ట్‌ షాపుల్లో లభించే మద్యం తాగి గొడవలు చేస్తున్నారని దింతో, మహిళలు, చిన్నారులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామంలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు షాపులను తొలగించకపోతే జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆమె హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *