మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టు

ఆదిలాబాద్ జిల్లా బంద్‌లో భాగంగా ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోయాబీన్ పంటను కొని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతోంది. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు అఖిలపక్ష రైతు, ప్రజా సంఘాల నేతలు, వ్యాపార సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *