. కాలనీ ల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి
తొలి సమయం మహబూబాబాద్ జనవరి 5:
పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలు వేసుకున్న కాలనీలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని *సిపిఐ( ఎంఎల్ )మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాయం చిన్న చంద్రన్న* అన్నారు. మహబూబాబాద్ లోని రాయల సుభాష్ చంద్రబోస్ నగర్ లోని గుడిసె వాసుల సమావేశా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీ నాయకుడు బూర్గుల మోష అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చంద్రన్న మాట్లాడుతూ గుడిసెలు వేసుకున్న నిరుపేద కాలనీవాసులందరికీ పట్టాలు ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు.వివిధ గ్రామాల నుండి ఉపాధి కోసం పట్టణానికి వచ్చిన పేదలు నిలువ నీడ లేక గుడిసెలు వేసుకొని కాలనీలను ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. అలాంటి కాలనీలలో రోడ్లు కరెంటు మంచినీటి సౌకర్యం పాఠశాలలు ఉపాధి కల్పన కోసం శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కాలనీవాసులకు అందించాలని ఆయన కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాలనీవాసులకు ఓటు హక్కును కల్పించాలని అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. అధికారులు స్పందించకపోతే కాలనీవాసులతో ఆందోళన చేయక తప్పదని ఆయన అన్నారు. అనంతరం రాయల సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. *అధ్యక్షుడిగా బూరుగుల మోష ఉపాధ్యక్షుడిగా జాగటి సూరయ్య ప్రధాన కార్యదర్శిగా బోయిని ఉప్పలయ్య సహాయ కార్యదర్శిగా సట్ల యాకయ్య కోశాధికారిగా బానోతూ వీరన్న* లతోపాటు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో *ఎల్లయ్య రాము బాలు మంగ్య వెంకన్న క్రాంతి ప్రమీలగౌరమ్మ ప్రవీణ్ బిచ్చ* తదితరులు పాల్గొన్నారు.