ప్రపంచ తెలుగు మహాసభల కవి సమ్మేళనంలో సత్తా చాటిన చిర్ర సతీస్

తొలి సమయం, దంతాలపల్లి : ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు అమరావతిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ సారధ్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారిషస్ ప్రధాని ధరం బీర్ గోకుల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహం, గోవా గవర్నర్ అశోక గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, తెలుగు ప్రముఖులు హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం గుర్రం జాషువ వేదిక కరుణ శ్రీ వేదికపై కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ అకాడమీ డైరెక్టర్ యువ కవి రచయిత ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకుడు ఇండియన్ సైబర్ యోధుడు డి హబ్ ప్రాజెక్ట్ మేనేజర్ సి.ఈ.ఓ చిర్ర సతీష్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా చిర్ర సతీష్ కి మెడల్ అందజేసి ఘనంగా సత్కరించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేస్తూ సాహిత్యంలో రాణిస్తున్న యువ కవి చిర్ర సతీష్ ప్రపంచ తెలుగు మహాసభలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి మెడల్ అందుకోవడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *