తొలి సమయం, శ్రీరంగాపూర్ : శ్రీరంగాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల కమిటీలో నూతన కమిటీల గురించి రాబోయే ఎంపిటిసి, జెడ్పిటిసి, ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే కార్యచరణ ఎలా ఉండాలి అని చర్చించి అక్కడికి విచ్చేసిన కార్యకర్తల నాయకుల అభిప్రాయాలు స్వీకరించడం జరిగింది.
అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి గురించి చర్చించడం అలాగే ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలకు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు ఇతర సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల, జిల్లా అనుబంధ కమిటీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.