బాధిత కుటుంబానికి అండగ కోదండ రామ సేవా సమితి

తొలిసమయం, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడ గ్రామానికి చెందిన యాప కిరణ్ కుటుంబానికి సహాయం అందించడంలో కోదండ రామ సేవా సమితి ముందుగా నిలిచింది. విద్యుత్ సర్క్యూట్ లో పూరిల్లు కాలిపోవడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, సమితి వెంటనే స్పందించి కుటుంబానికి అండగా నిలిచింది. కోదండ రామ సేవా సమితి వారు యాప కిరణ్ కుటుంబానికి నిత్యవసర సరుకులు, వంట సామాగ్రి, దుస్తులు, అంతేగాక ఆర్థికంగా 10,000 రూపాయల సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కోదండ రామ సేవా కమిటీ చైర్మన్ అండ్ నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవ చారిటబుల్ అధ్యక్షులు సైప సురేష్, కోదండ రామ వైద్య కమిటీ చైర్మన్ ప్రతాపన్ శ్రీకాంత్, ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ గంగారం గౌరవాధ్యక్షులు మాలే కనకయ్య, నర్సంపేట బీజేవైఎం నాయకులు అచ్చ దయాకర్, విగ్నేష్ గౌడ్, శ్రీ ధర్మశాస్త్ర సేవా కమిటీ కోశాధికారి గండు నవీన్, రామలింగేశ్వర స్వామి, దేవాలయం వేలువెళ్లి చైర్మన్ పబ్బ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవలో ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమం, ప్రజలకు సానుభూతి, మానవతా పరమైన బాధ్యత యొక్క మంచి ఉదాహరణగా నిలిచింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *