తొలిసమయం, కొత్తగూడ : కొత్తగూడ మండలంలో రైతులకు యూరియా సరఫరా కొరత లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి (ఎడిఏ) శ్రీనివాస్ రావు అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో విలేకరులతో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్‌లో గత ఏడాకి పోలిస్తే వ్యవసాయం పెరిగినందున, రైతులకు తగినంత యూరియాను అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల క్లస్టర్ వారీగా యూరియా సరఫరా చేయడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని కూడా పేర్కొన్నారు. తదుపరి సౌకర్యాల కోసం త్వరలో యాప్ ద్వారా రైతులు మరింత సౌకర్యంగా యూరియా పొందగలరని ఎడిఏ తెలిపారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్, ఏఈఓ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎడిఏ శ్రీనివాస్ రావు మన్‌గ్రోమర్ సెంటర్ మరియు పోగుళ్లపల్లి సొసైటీని సందర్శించారు.
యూరియా కోసం ఆందోళన వద్దు : ఎడిఏ శ్రీనివాస్ రావు
04
Jan