ప్రజాసేవే లక్ష్యంగా ముందుకొచ్చిన కాంగ్రెస్ నాయకుడు సతీష్ గౌడ్
స్వెట్టర్ల పంపిణీ కార్యక్రమంతో గ్రామంలో ప్రత్యేక ఆదరణ
తొలిసమయం,గూడూరు/మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టెవాడ గ్రామపంచాయతీ పరిధిలోని దొరవారి తిమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడిగె సతీష్ గౌడ్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాల పాలిట ఆయన ఆశాజ్యోతిగా నిలిచి, స్వయంగా స్వెట్టర్లను పంపిణీ చేశారు.గ్రామ ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకుంటూ, అవసరమైన వేళ ముందుండి స్పందించడమే తన లక్ష్యమని సతీష్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాలకంటే ముందు మానవత్వం ముఖ్యం. పేదల కష్టాన్ని తగ్గించడమే నిజమైన సేవ” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి.ప్రజాసేవే తన రాజకీయ జీవితం అనే దిశగా సాగుతున్న సతీష్ గౌడ్, ప్రతి సంక్షోభ సమయంలోనూ ప్రజల వెంట నిలుస్తూ వస్తున్నారని స్థానికులు ప్రశంసించారు. స్వెట్టర్ల పంపిణీ కార్యక్రమం గ్రామంలో ప్రత్యేక ఆదరణ పొందింది.ఈ కార్యక్రమంలో మట్టెవాడ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వాసం వీరస్వామి, హనుమాన్ తండ సర్పంచ్ అజ్మీర రమేష్ నాయక్, భూపతి శ్రీను, ధనసరి రమేష్, పెనుక మహేందర్, శ్రావణ్ కుమార్, శ్రీధర్ శర్మ, ఈసం గణేష్, పూణెం లోకేష్, సురనేని మణి పటేల్, పూణెం సాయిరాం తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.