తొలి
సమయం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇటీవల కొత్తగూడెం క్లబ్ ఆవరణలో ఆ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిఈటిఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు పుట్ట శంకరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లాలోని వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సమక్షంలో సమావేశాన్ని గౌరవప్రదంగా నిర్వహించారు.సమావేశంలో పాల్గొన్న సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సంఘం కార్యవర్గాన్ని రెండు సంవత్సరాలు పొడిగించి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.
క్రింద పేర్కొనబడిన వారిని ఏకగ్రీవంగా తీర్మానం చేసి కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా సున్నం బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గా కొమరం వెంకటనారాయణ, టీ మల్లేష్, పి. రాంబాబు, ఎం. జనార్దన్, పి వెంకట రమణ, ఎన్నికయ్యారు. అలాగే సాధారణ కార్యదర్శిగా కురుసం రామనాథం, జాయింట్ సెక్రటరీలుగా సిహెచ్. యుగంధర్, ఎస్.నాగేశ్వరరావు, బి.హరికృష్ణ, పి దశమి బాబు, పి. ప్రసాద్, ఏ కృష్ణ, కోశాధికారిగా బి గోపాల్ రావులు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బి. మోతిలాల్, ఎస్.రాంబాబు, కే.వెంకటేశ్వర్లు, కే. రాంబాబు, కే. చిన్న బాబురావు, వై. మదన్మోహన్, డి రవి, ఎం. రాంబాబు, ఎన్. బాబురావు, ఎస్. వీరభద్రం, ఎం. రాము, ఎం. రాకేష్ లు ఎన్నికయ్యారు. అలాగే మహిళా ప్రతినిధులుగా పి. శిరోమణి, కే. నాగేంద్రమ్మ, కే. రాములమ్మ, కే. నాగలక్ష్మి, వి.సీతాదేవి, వి. ప్రత్యూష, కే. నాగమణి, కే. కుమారి, బి. బాపనమ్మ, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సంఘం నాయకులు ప్రకటించారు.
PET నూతన కార్యవర్గం ఎన్నిక
04
Jan