డిసెంబర్ 9 చలో ఆసిఫాబాద్ సభ కు ఆదివాసీలు లక్షలాదిగా తరలి రండి…
భిన్నదృక్పదాలు, భిన్న రాజకీయపార్టీల అంతిమ లక్ష్యం తెలంగాణా రాష్ట్ర సాధనదిశగా పోరాడితేనే తెలంగాణ ఒచ్చింది,ఆదివాసీ ధర్మ యుద్దానికి అదే స్పూర్తి
నవంబర్ 15న అచ్చంపేట సభకు అశేషంగా తరలి,విజయవంతం చెయ్యాలని పోష్టర్ ఆవిష్కరణ..
— ఆదివాసీ సంఘాలు ఎన్నైనా ఉండనీ, వాళ్లంతా ఎవరిపద్దతిలో వాళ్ళు చట్ట బద్దతలేని లంబాడాల జరిగే ధర్మపోరాటం లో భాగస్వామ్యం కావడాన్ని, స్వాగతిస్తాం అన్నారు
ఈనెల 23న, మానుకోట జిల్లా గుంజేడు 30న ఇల్లందు, డిసెంబర్ 4వ తారీఖు చిరుమల్ల లో జరిగే సన్నాహక సభలకు ఆదివాసీలు అశేషంగా తరలి రావాలి
ఆదివాసి 9 తెగల సమన్వయకర్త, జేఏసీ చైర్మెన్ చుంచు రామకృష్ణ..
*తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు, భిన్న సామజిక సంఘాలు భిన్న బావాలు, భిన్న దృక్పదాలను ప్రక్కన పెట్టేసి అంతిమంగా ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉమ్మడి ఉద్వే భావనగా, ద్యేయంగా, పోరాడి రాష్ట్రాన్ని సాధించామని, ఆఁ ఉద్యమమే ఆదివాసీ ఉద్యమానికి స్ఫూర్తి అని,ఆదివాసి 9 తెగల జాక్ చైర్మెన్ చుంచు రామకృష్ణ అన్నారు డిసెంబర్ 9న ఆసిఫాబాద్ లో జరిగే సభకు 9 తెగల ఆదివాసీలు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆదివాసి జాక్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ మాట్లాడుతూ*
తొలి సమయం ఖమ్మం నవంబర్ 9:
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విభిన్న ఉద్యమరూపాలు పాల్గొన్నాయి అన్నారు, అవి సాంస్కృతిక రూపాలు, రాజకీయ రూపాలు, పోరాట రూపాలు, న్యాయ పోరాటాలు పాల్గొని జనాన్ని, తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేశాయన్నరు. ఎవరి పద్ధతిలో వాళ్లు పాల్గొని తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని,ప్రజల్లోకి బలంగా తీసుకొని పోయారని అన్నారు. అదే పద్దతిని చట్టబద్ధతలేని లంబాడీలను జాబితా నుంచి తొలగించలనే న్యాయపోరాటం పరిణతి చెందిందన్నారు, సుప్రీం కోర్టులో ఆ తీర్పుకు కాలం కూడా దగ్గర పడ్డది అన్నారు. దానికంటే ముందు ఆదివాసీలను ఐక్యం చేయడానికి సాంస్కృతిక ఉద్యమాన్ని,ఆదివాసి సమాజం ముందుకు తీసుక పోయాం అన్నారు,వందలాది ఆదివాసీ 9తెగల ఇలవేల్పుల సమ్మేళనాలు చేశామన్నారు మనం ఏం కోల్పోతున్నాము,మనకేం కావాలి, అనేది ఐదు రాష్ట్రాల తొమ్మిది తెగల ఆదివాసీలకు నేర్పుతూ 9తెగలను ఐక్యత చేయడంలో కొంత మేరకు సఫలీ కృతం అయ్యమన్నారు
ఆదివాసి ధర్మ యుద్ధంలో ఆదివాసీ సంఘాలు అనేకం పాల్గొనాలని, వారందరి దృక్పదాలు, జెండాలు, ఎజెండాలు, కూడా చట్టబద్ధతలేని లంబాడాను ఎస్టీ జాబితా నుండి తొలగించడమే ఏకైక లక్ష్యంగా పోరాడితే ఆదివాసి 9 తెగల జాక్ స్వాగతిస్తుందన్నారు. అంతకు మించి ఇంకా ఇతర అభిప్రాయాలు జేఏసీ కి లేవు అని కుండబద్దలు కొట్టారు. సంఘాలు వారి వారి పద్ధతిలో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ 9న అసిఫాబాద్ జరిగే మహాసభకు ఆదివాసీలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు, డిసెంబర్ 9న అసిఫాబాద్ సభకు ముందు జరిగే సన్నాహక సభల పై ఆదివాసీలు ఒక అవగాహనకు రావాలి అన్నారు, సన్నాహాక సభలో భాగంగా చెంచు తెగల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట లో నవంబర్ 15న జరుగు సభకు ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.దీనికి సంబందించిన పోస్టర్ ఆవిష్కరణ చేసారు ఈనెల 23 మహబూబాబాద్ జిల్లా గుంజేడు , ఈనెల 30న ఇల్లందులోను, డిసెంబర్ 4న చిరుమల్ల
సమ్మక్క తల్లి పుట్టుగద్దెలు వద్ద సన్నాహక సభను నిర్వహిస్తున్నమన్నారు.
తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మైపతి అరుణ్ మాట్లాడుతూ..అక్రమంగా ఎస్టీ జాబితా లో చేరడానికి 250 సంవత్సరాలనుండి ప్రయత్నం చేస్తున్నారని, మనముందు తరాలు వ్యతిరేకించాయి అన్నారు, 76 లో 1976లో అక్రమంగా ఎస్టీ జాబితాలో చేరే ప్రయత్నాన్ని విజయవంతం చేసుకున్నారని ఎ ద్దేవా చేసారు, రాజ్యాంగ సవరణ జరుగకుండానే ఎస్టీ జాబితాలో చేరిన ఆధారాలు కోర్టులో నిరూపణ అవుతుందని,రోజు రోజుకు లంబాడాలు ఉ
రుకులు పరుగులతో కొంతమంది మేడావులతో మాట్లాడిస్తున్నారనిఅన్నారు, చరిత్రను వక్రీకరణకు పాల్పడితే పొరపాటు అన్నారు గాలి వినోద్ కుమార్ జియో లోజీకల పరిజ్ఞానంపై పట్టు లేకుంటే తెలుసుకోవాలని, అడ్డంగా మాట్లాడొద్దని అన్నారు,
ఈ కార్యక్రమం లో ఆధార్ సొసైటీ అధ్యక్షులు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కల్తీ వీరమల్లు, కోట్నాక విజయ్ సిద్ధ బోయిన లక్ష్మీనారాయణ, ఆదివాసి చైతన్య మహిళా శక్తి చైర్మన్ పూసం విజయ లక్ష్మి, రిటైర్డ్ డి.ఎస్.పి కురుసం సీతారాములు, చుంచుతెగ ప్రతినిధి మల్లికార్జున్, ఆదివాసి ఓయూ ప్రతినిధి బట్ట వెంకటేశ్వర్లు, ఖమ్మం పటేల్ ముక్తి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు