జర్నలిస్టు సంఘాలు సంక్షేమం ముసుగులో జర్నలిస్టు వ్యవస్థను అంగడి చేశారు..

జర్నలిస్టు సంఘాల సంక్షేమం ముసుగులో జర్నలిస్టు వ్యవస్థను అంగడి చేశారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— జిల్లా మొత్తంగా జర్నలిస్టులు అంటే చులకన భావన రావడానికి సంఘాల ముసుగులో సొంత ప్రయోజనాలకు పాల్పడే వ్యక్తుల పట్ల జాగ్రత్త గా ఉండక పోవడమే..

జర్నలిస్తుల ఆత్మగౌర పరిరక్షణ, హక్కుల కోసం పోరాడుదాం.

ఇది ఇలాగే కొన సాగితే జర్నలిస్ట్ వ్యవస్థ ప్రశ్నార్ధకమే

వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యులు వేముల అయోధ్య రామయ్య

తొలి సమయం హైదరాబాద్ మర్చి 28:
జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టుల సమస్యలపై పోరాడాలి, ఫీల్డ్ మీద కష్టపడి పనిచేసే జర్నలిస్తుల పక్షాన పనిచేసే జర్నలిస్తుల కోసం పనిచెయ్యాలని, కానీ జర్నలిస్టు సంఘాల లో ముసుగులో సొంత ప్రయోజనాలకు పాల్పడుతూ.. రాజకీయ పార్టీల ముసుగులో పనిచేస్తూ,కష్టపడి పని చేసే జర్నలిస్టుల ఆత్మగౌరవం కోసం ఇచ్చే నివేషణ స్థలాలు. డబుల్ బెడ్రూంలు అక్రిడేషన్ కార్డులను అంగడి చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ నోట్ ద్వారా ఆయన మాట్లాడుతూ..అక్రమ పద్ధతుల్లో ప్లాట్స్ కొట్టేసిన జర్నలిస్టేతర రాజకీయ వ్యక్తులు వెంటనే పేద మధ్య తరగతి కుటుంబాలకు అమ్ముకుని సొమ్ముచేసుకునే అవకాశం సంఘాల్లో పనిచేసే జిల్లా స్థాయి నాయకులే కారణం కావడం అత్యంత అసహ్యంగా ఉందని అన్నారు, సమాజం లో నేరపూరిత వాతావరణం సృష్టించడానికి సంఘాలు,నాయకులు పాల్పడడం కండించాలన్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫాలోవర్స్ కు జర్నలిస్టు ముసుగు వేసి నివేషణ స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం, అందుకు అధికారులు సహకరించి జర్నలిస్ట్ వ్యవస్థ లో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు రాజ్యాంగ వ్యవస్థకు, విరుద్ధం అన్నారు పైగా నిజం మాట్లాడే రాసే జర్నలిస్తులను మాఫియాల ద్వారా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా 58మంది మంది అక్రి డేషన్ కార్డ్స్ పరిశీలన చేస్తే అనేక విస్తూపోయే నిజాలు రావొచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఇటీవల 58మందికి జిల్లా కేంద్రం లో ఇచ్చిన నీవేషణ స్థలాల్లో తప్పుల తడకగా ఉన్నది అన్నారు, ప్రధాన పార్టీకల్లో పనిచేస్తూ ఇంప్లుయెన్సీని ఉపయోగించుకొని రెండు సార్లు తీసుకున్నోళ్లు, అక్రి డేషన్ కార్డ్స్ లేనోళ్ళు అసాంఘీక శక్తులు, ఫోక్సో కేసుల్లో ఉన్నోళ్లు అదేవిదంగా క్రషర్ మిల్స్, ల్యాండ్ స్యాండ్, మట్టి, మైనింగ్ మాఫియా ఫాలోవర్స్ కూడా నీవేషణ స్థలాలు పొందిన 58 మంది లిస్టులో ఉన్నారని, 58మంది అర్హత లేని వారిపై అన్యాయం జరిగిన జర్నలిస్టులు కొంతమంది జిల్లా కోర్టును మరియు ఇంకొంతమంది హైకోర్టును ఆశ్రయించారుఅన్నారు అయినా కానీ మానుకోట జిల్లాలో నీవేషణ స్థలాల్లో అవకతవకలపై జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవడంలో మాత్రం చొ రువు తీసుకోవడం లో నిర్లక్ష్యం వహిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. హైకోర్టు మరియు జిల్లా కోర్టు నుండి వచ్చిన తీర్పుల ఫై వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఈ గందరగోళానికి తెర తీయకపోతే హైకోర్టులో కంటెంప్ట్ కేసులు పడే అవకాశం లేకపోలేదు అన్నారు.ఇక నుండి కనీసం 5సంవత్సరాలైన ఫీల్డ్ మీద పనిచేయని మాయగాళ్ళకు నీవేషణ స్థలాలు ఇవ్వకుండా అధికారులు జాగ్రత్త పడాలని సూచన చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *