కడతేరిన కూలి బ్రతుకు
తొలి సమయం,మహబూబాబాద్ మర్చి 21:
వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో చర్లపాలెం గ్రామానికి చెందిన గూడెల్లి అరుణ(38)మృతి చెందగా ఐదుగురికి స్వల్ప గాయాలు,మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.*
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. *తొర్రూరు మండలం చర్లపాలెం వైపు నుండి మరిపెడ వైపు మిర్చి ఏరడానికి కూలీలను తీసుకువెళ్తున్న ఆటోను నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు ఇటుక బట్టీల దగ్గర గుర్తుతెలియని లారీ స్వల్పంగా ఢీకొనడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది..*
*గాయాలైన వారిని స్థానిక పోలీసులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమై ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం పోలీసులు అన్వేషణలో ఉన్నారు.*