నేడే సమ్మక్కతల్లి కళ్యాణ మహోత్సవం..

నేడే సమ్మక్కతల్లి కళ్యాణ మహోత్సవం..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముసలమ్మ గుట్ట నుండి బయలెల్లిన సమ్మక్క తల్లి…

— చందా గోవర్దన్ మార్గ నిర్దేశంలో సమ్మక్కను తీసుకొని తీసుకొస్తున్న టీం,

— గురువారం రాత్రి 2గంటలకు గుట్టకు చేరుకున్న చందా వంశీయులు, కోయ పుణ్యం ధర్మం ప్రచారక్ చుంచు రామకృష్ణ,వడ్డె సిద్ద బోయిన వెంకటేశ్వర్లు, తదితరులు

క్షణ క్షణం సమ్మక్క కళ్యాణం విజయవంతం కావడానికి కార్యదీక్షితులుగా ఆదివాసి 9తెగల సమన్వయకర్త.చుంచు రామకృష్ణ..

తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ ఫిబ్రవరి 13:

చిరుమళ్ల లో సమ్మక్క సారక్క ల కళ్యాణం కోసం సర్వం సిద్ధం చేసారు రాత్రి రెండు గంటలకు చిరుమళ్ల సమీపంలో లో ఉన్న ముసలమ్మ గుట్ట నుండి సమ్మక్క తల్లిని తీసుకొని రావడానికి చందా గోవర్ధన్ పదనిర్దేశంలో కోయ పుణ్యం ధర్మ ప్రచారక్ చుంచు రామకృష్ణ నేత్రుత్వం లో గుట్టకు చేరారు,ఆదినాటి ఆదివాసి సంప్రదాయ పద్దతిలో తల్లి సమ్మక్క కుంకుమ భరిణ రూపం లోఈరోజు ఉదయం 10గంటలకు కళ్యాణ గద్దెల వద్దకు రానున్నారు గుట్టను ఆరోహించిన చందా వంశీయులు చందా ప్రశాంత్ చందా అశోక్ మైపతి అరుణ్ కుమార్ చందా మధు, చందా ప్రదీప్, కొమరం నరేష్ చందా శ్రీనివాస్, పోలె బోయిన ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు.. వీరంతా తెల్లవారి మూడు గంటల సమయంలో ముసలమ్మ తోగులో స్నానం ఆచరించారు. మొదట గంగమ్మ,పురాణకాలం నాటి శివుని గుడిలో పూజలు అర్చనలు చేశారు. తల్లికి పసుపు పారాణి, పట్టు చీర ఇతర వస్త్రాలు సమర్పణ చేశారు ఇతర ఆదివాసీ సంప్రదాయం దార్మిక పద్ధతుల్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు.ఈ రోజు 12గంటల సమయంలో శుభ ముహూర్తాన. కళ్యాణం జరగనున్నది. తలపతి చందావీరయ్య ధర్మకర్త బిక్షపతి, భూపతి, చందా వంశపెద్దలు మాజీ శాసనసభ్యులు, చందా లింగయ్య కళ్యాణం లో పాల్గొని విజయవంతం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *