చిరుమళ్ల సమ్మక్క సారలమ్మ జాతరకు 5లక్షలు ప్రకటించిన ప్రభుత్వం…

చిరుమళ్ల సమ్మక్క సారలమ్మ జాతరకు 5లక్షలు ప్రకటించిన ప్రభుత్వం…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— భద్రాచలం ఐటీడీఏ పీవో కు ఆదేశాలు ఇచ్చిన ఆదివాసీ ఆడబిడ్డ మంత్రి సీతక్క

— వేల్పుల తరలింపు , ఆడ్తి డోలు ఖర్చుల కోసం ఆ 4గురు ఆదివాసీ ప్రజాప్రతినిధుల సహాయం కోసం, ఇంటి వేల్పు తలపతులు , జాతర కమిటీ సభ్యుల ఎదురు చూపు..

తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ :

చిరుమళ్ల సమ్మక్క తల్లి జాతరకు ఆర్ధిక సహాయం కోసం మంత్రి సీతక్క ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం ఐటీడిఏ పిఓ వెంటనే 5లక్షలు ప్రకటించినట్లు చిరుమళ్ళ సమ్మక్క జాతర కమిటీ తెలియజేసింది . ఈ సందర్బంగా నిర్వహణ కమిటీ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది .ఈ సందర్బంగా చిరుమళ్ళ జాతర కమిటీ జాతరకు సంబందించిన ఆర్ధిక ఇబ్బందులపై అనేక సార్లు గత పాలకులపై, స్థానిక ఎంఎల్ఏ పై ఏకరువు పెట్టింది . గత 6 సంవత్సరాల నుండి చిరుమళ్ళ సమ్మక్క పుట్టు గద్దెల జాతర చారిత్రక ఆదారాలు,నేపధ్యాన్ని ఆధార్ సొసైటీ మరియు చిరుమళ్ల జాతర కమిటీ భుజాలపైకి ఎత్తుకుంది అన్నారు ఆదివాసీ తెగల సమన్వయకర్త. 2023లో జరిగిన జాతరకు 124 ఇలవేల్పులు, ఆడ్తి డోలి, రేల ఆట పాట , డాలు గుడ్డ కథకులు లాంటి అనేక కళా కారులు సుమారు 5 రాష్ట్రాల నుంచి చిరుమళ్ళ జాతర కు విచ్చేసి ఆ నాటి జాతరను జయప్రధం చేశారని అన్నారు. ఆ జాతరకు సుమారు 50వేల మంది వచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ నాటి ప్రజా ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించాలి అని కోయ పున్నెం ధర్మ ప్రచారక్ చుంచు రామకృష్ణ కోరారు . ఈసారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర గవర్నర్ కు సుమారు 50 లక్షల ఆర్ధిక పరమైన సహాయం కోసం అర్జీ పెట్టుకున్నామని అన్నారు. కానీ ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం గురించి ఏ ప్రకటన రాలేదు అన్నారు.అయినా జాతరను దాతల సహాయంతో కొనసాగించే ప్రయత్నంలో ఉన్నామని అన్నారు.. అదృష్టవశాత్తు మంత్రి సీతక్క గారు స్పందించి అన్నారు.అయితే మొదటి నుండి ఆదివాసీ ఆ 4గురు ఆదివాసీ ప్రజాప్రతినిధులు జాతర పై కనీసం కనెక్ట్ కావడం లేదని ఆవేదన పడ్డారు.ఏటికేటా ఆదివాసిల ఆర్ధిక , సాంస్కృతిక పరిస్థితులు అడుగు అంటి పోతున్నాయి అన్నారు. అసలు భవిష్యత్ తరాలకు అదివాసి వారసత్వ పండుగలు సంప్రదాయాలు ప్రశ్నార్థకమై పోతున్నాయని అన్నారు, భవిష్యత్తు తరాలు ఇంటి వేల్పుల పండుగల కొన సాగింపులో భాగంగానే చిరుమళ్ల జాతరను భలోపేతం చేస్తున్నామని అన్నారు. ఈ సారి జాతరకు మంత్రి సీతక్క గారు 13 వ తారీఖున చిరుమళ్లకు వస్తానని నిర్వాహకులతో చెప్పడం జరిగింది. కావున యావత్ ఆదివాసీ సమాజం సమ్మక్క పగిడిద్దరాజు ల కళ్యాణం విజయవంతం చేయడానికి కదలిరావాలని, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం విరాళాలు కమిటీ వారికి అందచేయాలని విజ్ఞప్తి చేశారు సమన్వయకర్త చుంచు రామకృష్ణ గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *