ఆదివాసి సంస్కృతి _ జాతి ఐక్యతను చాటుదాం”
చిరుమళ్ల సమ్మక్క తల్లి జాతర కొనసాగింపు లో భాగంగా.
ఆదివాసి కోయత్తూర్ తెగ వేల్పుల సంస్కృతి పునరుద్ధరణకు ఆర్థిక సహాయం చేసిన వారికి ఐటీ సెక్షన్ 80జి ద్వారా సడలింపు, పన్ను మినహాయింపు…..
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మేధావులు సమ్మక్క తల్లి కళ్యాణానికి విరాళాలు ఇవ్వండి! చిరుమల్ల సమ్మక్క పుట్టు గద్దెల జాతరకు సహకరించండి..
ఆధార్ సొసైటీ
తొలి సమయం, భద్రాద్రి కొత్తగూడెం ప్రత్యేక ప్రతినిధి ఫిబ్రవరి6:
ఆదివాసీ కోయత్తూర్ తెగ ఇలవేల్పుల సంస్కృతి పునరుద్దరణ లో భాగంగా చిరుమళ్ల సమ్మక్క – పగిడిద్దరాజుల కళ్యాణం కోసం ఆర్థిక సహాయం అందించే దాతలు మీ విరాళాలు ఆధార్ సొసైటీకి అందించడం ద్వారా ఐటీ సెక్షన్ 80జి ద్వారా టాక్స్ సడలింపు, పన్ను మినహాయింపు పొందవచ్చునని ఆధార్ సొసైటీ జాతీయ చైర్మన్ గోంది వెంకటరమణ రిటైర్డ్ ఈ ఈ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కల్తీ వీరమల్లు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, కోయ పున్నెం ధర్మ ప్రచారక్ చుంచు రామకృష్ణ డిఈ ఓ ప్రకటనలో తెలియజేశారు.. ఈ సందర్భంగా జాతరకు సంబంధించి అనేక విషయాలను తెలియజేశారు.. విరాళాలు ఇవ్వడం ద్వారా సమ్మక్క తల్లి ఆశీస్సులతో పాటు ఐదు రాష్ట్రాల వనదేవతల ఆశీర్వాదాలు పొందవచ్చునని అన్నారు. 2023 సంవత్సరంలో వస్తు , ఆర్థిక రూపేనా విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈసారి కూడా ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతరకు ఇవ్వదలుచుకున్న ఆర్థిక సహాయం గురించిన సమాచారం నిర్వహణ కమిటీ వారికి అందలేదు, కావున కోయత్తూర్ వేల్పుల రాకపోకల కొరకు, అడ్తి డోలు కళాకారులు, దేవరబాలలు, శివసత్తులు,నాగులమ్మ మాతలు ,పూజ సామాగ్రి కొరకు ఇచ్చే దాతలకు సమ్మక్క తల్లి బండారి, బంగారం, ఇప్ప లడ్డు మరియు ఆధార సొసైటీ ద్వారా ఐటి 80జి టాక్స్ రిసిప్ట్ మీరు తెలియచేసిన అడ్రస్కు పంపించబడును అన్నారు జాతర సమన్వయకర్త చుంచు రామకృష్ణ . చిరుమల్ల సమ్మక్క తల్లి జాతర కొనసాగింపులో భాగంగా ఆదివాసి ల ఐక్యత మరియు సంస్కృతి పునరుద్ధరణకు ప్రాతి ఒక్క ఆదివాసీ బిడ్డ ఓటు బ్యాంక్ రాజకీయాల కతీతంగా నడుం కట్టి సమ్మక్క తల్లి అక్షయపాత్ర ద్వారా వచ్చే 10,11,12 తారీకులలో పినపాక నియోజకవర్గంలోని దాతలను విరాళాలు ఇవ్వమని ప్రతి గూడెం తిరుగుదాం అని చుంచు రామకృష్ణ పిలుపునిచ్చారు.
సమ్మక్క
పగిడిద్దరాజుల కళ్యాణ మహోత్సవానికి ముందు ఘట్టం…
వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలోని పర్షిక వంశస్తులతో కలిసి చందా వంశస్థులు సమ్మక్క తో కళ్యాణానికి పూర్వ మజ్జూర్ కొత్తపల్లి పగిడిద్దరాజును ఆదివాసి కోయత్తూరు సంప్రదాయాలతో చిరుమళ్ల కు తీసుకొని రావాలని చందా వంశస్తుల తరఫున జోడా వెళ్లిన చందా వీరయ్య ఆహ్వానించారు. ఇరువైపుల వారి అలాయ్ బలయ్ తో పాటు, చేతికి కంకణాలు కట్టుకుని, కళ్యాణం చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చిరుమల్ల విప్ప చెట్టు గద్దె మీద పందిరిలో చేస్తామని చందా వంశస్థులు, పర్శిక వంశస్థులకు తెలియజేశారు.