చిరుమళ్ల జాతర లో సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేస్తున్న చుంచు వంశస్తులు..
తొలి సమయం ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 6:
ఈనెల 13 సమ్మక్క పగిడిద్దరాజుల కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు సింగారం గ్రామ చుంచు వంశీయులు తయారుచేస్తున్నట్లు కోయ పుణ్యం ధర్మ ప్రచారక్ ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే మాఘమాసం ఫిబ్రవరి 13 గురువారం రాత్రి 12 గంటలకు చిరుమళ్ల లో జరిగే పగిడిద్దరాజు కళ్యాణానికి ఆదివాసి కోయత్తూర్ సంప్రదాయాలతో ముత్యాల తలంబ్రాలు ( కొట్నాలు ) సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు ఐదవ గట్టు బండాని గోత్రం శ్రీ శ్రీ బాల కుమారస్వామి (సమ్మక్క తమ్ముడు ) ఇంటి ఇలవేల్పును మడగూడెం) కొలిచే గార్ల బయ్యారం మండలం సింగారం గ్రామ చుంచు వంశస్థులకు తల్లి సమ్మక్క ఈ భాగ్యం కల్పించినట్లు తెలిపారు.