గుబాళించిన ఆదివాసి అడివమ్మ సంస్కృతి పరిమళాలు , ఆడిబిడ్డల గొంతుల సవ్వడి

ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళనంలో ” గుబాళించిన ఆదివాసి అడివమ్మ సంస్కృతి, ఆడిబిడ్డల గొంతుల సవ్వడి…”

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం భద్రాద్రి కొత్తగూడెం ప్రత్యేక ప్రతినిధి ఫిబ్రవరి 5: ఫిబ్రవరి 2ఆదివారం ఖమ్మం కేంద్రం లోని వెలుగుమట్ల ఫారెస్ట్ పార్క్ లో ప్రైవేట్, ప్రభుత్వం ఉద్యోగ మరియు అత్యున్నత స్థాయి రిటైర్డ్ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతిక సమ్మేళనంలో అడివమ్మ ఆదివాసీ ఆడబిడ్డల ఆట పాటలతో ఖమ్మం కేంద్రం లోని వెలుగు మట్ల ఫారెస్ట్ పార్క్ ఆదివాసీ సాంస్కృతిక పరిమళాల గుబాలింపు వేదిక సర్వత్రా ఆసక్తిని రేపింది, అడవి బిడ్డల ఆకుపచ్చని వస్త్ర అలంకరణ పచ్చని ప్రకృతిని ఆవిష్కరించించి.సభికులను మంత్ర ముగ్దులను చేసింది, అసలు సిసలైన ఆదివాసీ, కోయ భాష రాగాలాపణతో చిట్టడవులు వాగులు వంకలు,కొండలు సెలయేర్లు పక్షుల శబ్దాలు, కళ్లెదుట కదిలినట్లుగా అనుభూతిని కలిగింపజేసింది , ప్రకృతి పర్యావరణానికి ప్రతీకలుగా ఆదివాసీ కళాకారిణీలు నిలిచారు, కోయపుణ్యం ధర్మప్రచారక్, ఆదివాసీ 9తెగల సమన్వయ కర్త చుంచు రామకృష్ణ దశా దిశా నిర్దేశణంలో జరిగిన ఈ కార్యమానికి 3వందల ఆదివాసీ కుటుంబాలు సుమారు 15వందల మంది ఆదివాసీ విద్యా ఉద్యోగ, విరామ అత్యున్నత స్థాయి ఉద్యోగులు, సబ్ కలెక్టర్స్. ఆర్డీఓలు, జిల్లా అధికారులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *