కోయత్తూర్ జోడ ( కబురు) ను జయ ప్రధం చేయండి…

కోయత్తూర్ జోడ ( కబురు) ను జయ ప్రధం చేయండి…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భారత రాజ్యాంగం గుర్తించిన ఆదివాసి తెగల అభివృద్ధి, సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ కోసం ఆదివాసీ ఉద్యోగులుగా మన జాతి ఐక్యతను చాటుదాం..

ఆదివాసీ కోయత్తూర్ నిర్వహణ కమిటీ ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం ప్రధాన ప్రతినిధి ఫిబ్రవరి 2:

ఒక నాటి గోండ్వాన ప్రాంతంలోని ఐదు రాష్ట్రాల్లో ఉన్న కోయతుర్ ,ఆదివాసీ తెగల ఐక్యతను చాటాలి అనే ఉద్దేశ్యం లో భాగంగానే ఫిబ్రవరి రెండో తారీకు ఉదయం 9 గంటలకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల ఫారెస్ట్ పార్క్ లో
“ఆదివాసీల ఆత్మీయ సమ్మేళనం” ను నిర్వహిస్తున్నామని అన్నారు.ఖమ్మం జిల్లా కేంద్రం లోని ఆదివాసి కుటుంబ సభ్యులు అశేషంగా తరలివచ్చి ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణ నిర్వహణ కమిటీ కార్యక్రమం ఉద్దేశాలను తెలియజేసింది.. ఈదేశ మూలవాసులైన భారత రాజ్యాంగం గుర్తించిన ఆదివాసీ తెగల అభివృద్ధి సంక్షేమం, పరిరక్షణ కోసం ఐక్యతను చాటాలి అని పిలుపు ఇస్తున్నామని అన్నారు ఉద్యోగాల నిమిత్తం పిల్లల చదువుల కోసం ఖమ్మం పట్టణంలో స్థిర మరియు తాత్కాలిక నివాసం ఉండే ఆదివాసి ఉద్యోగులు తరలి రావాలి అన్నారు. ఆదివాసీల ఆచార, సంస్కృతి సంప్రదాయాలు నేటి తరాల పిల్లలకు తెలియజేయాలని ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు, కనుక జోడ కబుర్ అందుకొని కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రి దనసరి సీతక్కగారు ,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య గారు,
ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ,ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గార్లు అదేవిదంగా విశిష్ట అతిధులుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. అతిథులుగా ఆదివాసి బుద్ది జీవులు హాజరు అవుతారని తెలియ జేశారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గం” ల నుండి సాయంత్రం 5 గం”ల వరకు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *