దేవర పల్లిలో కొండంత ఆదివాసీ పండగ- తెల్లం పరివార్ సమార్

దేవర పల్లిలో కొండంత ఆదివాసీ పండగ- తెల్లం పరివార్ సమార్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— 5రాష్ట్రాల 9తెగల ఆదివాసీలు- కళాకారులు చే నిండిన దేవర పెల్లి ఆదివాసి కళాక్షేత్రం..

–ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణను దశ దిశలు వ్యాపించిన ఆదివాసి డోలు దెబ్బల శబ్దంతో ఘన స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ, ఆదివాసీలు..

తొలి సమయం, భద్రాద్రి కొత్తగూడెం / దుమ్ముగూడెం: ఆదివాసి వంశస్థులు తెల్లం పరివార ఆధ్వర్యంలో తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గడ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దేవర పెళ్లికి చేరుకున్నారు. ఆదివాసి దేవరపల్లి కళాక్షేత్రం తెల్లంపరివారు వంశస్థులతో సందడి చేసింది అంగరంగ వైభవంగా ఆదివాసీ ధార్మిక వాతావరణాన్ని సంతరించుకున్నది.. ఆది వాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణకు తెల్లంపరివార్ ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ ఊరబోయిన భీమరాజు ఉత్సవ కమిటీ ఘన స్వాగతం పలికింది.తెల్లం పరివార్ మహిళలు కళాక్షేత్రం లోకి వస్తున్న డోలు దెబ్బ సాంస్కృతిక బృందానికి
మరియు తెల్లం పరివార్ కుటుంబాలకు బొట్టు పెడుతూ ఆహ్వానించడం అత్యంత ఆకర్షణగా నిలిచింది.కళాక్షేత్రం లో వేదికపై ఆదివాసిలు అత్యంత ప్రీతిగా భావించే రేలా పాట, డోల్ దెబ్బ కళాకారుల నాట్యం ఆదివాసీ శ్రేణులను పులకరింప జేసింది 5రాష్ట్రాల ఆదివాసీ తెగలకు అత్యంత పగడ్బందీ తో కూడిన భోజన వసతి. బస చేయడానికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.. రాష్ట్రాల అతిదులకు కేటాయించిన ప్రత్యేక స్థలాల్లోకి కళాకారులు చేరుకున్నారు చత్తీష్ గడ్ కళాకారులు వేసిన కుండుడు డోల్ రూపం అర్థి కళాకారుల డోల్ నృత్యం, చత్తీస్గడ్ మహిళా కళాకారుల కుచిడి మొగ్గలు కళా రూపాల ప్రదర్శన సంబురం అంబురాన్ని తాకింది వివిధ రాష్ట్రాల ఆదివాసీ తెగలు వివిధ భాషల్లో మాట్లాడు తున్న తీరు ఆసక్తిని కనపరిచింది..అనంతరం తెల్లం పరివార్ పెద్దలకు ఆదివాసి సాంస్క్రతిక సేనాని షాలువాలతో సత్కారం చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *