చిరుమళ్ళ సమ్మక్క, సారక్కల మహిమాన్విత జలకం బావి, ఇప్ప చెట్టు..
తొలి సమయం, ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్త గూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం కరక గూడెం చిరుమళ్ళ గ్రామంలో సుమారు వందల సంవత్సరాల నాటి సమ్మక్క సారక్కకు సంబందించిన ఆనాటి చారిత్రక ఆనవాళ్లుగా జలకం బావి,ఇప్పచెట్టు నేటికీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇటువంటి పవిత్ర క్షేత్రంలో చందా వంశస్థుల ఆధ్వర్యంలో 5 వ సారి నేడే సమ్మక్క తల్లి 21 రోజుల దీక్షలు ప్రారంభమైనాయి. ఇక్కడ వున్న జలకం బావిని అంతకు ముందు కోనేరు గా పిలిచేవారు అని గ్రామస్తులు చెబుతుంటారు. అయితే అధి లోతైన మడుగు రూపం లో ఉండేది అని , మూడు కాలాలు నీళ్లు నిక్షేపంగా ఉంటాయి అని ఇక్కడి పెద్దలు చెప్పటం విశేషం. ఈ బావి నీళ్లు కొబ్బరి కాయ నీళ్ల లాగా ఏమాత్రం రంగు మారకుండా ఉంటాయి. నీళ్లతో స్నానం ఆచరించిన ప్రతి వారు శరీర బరువు తగ్గి తేలిపోయిన అనుభూతి పొందుతారు శరీరం నుండి ఏదో చీడ పీడల జాడ్యాన్ని వదులుకున్న బావన కలుగుతోంది అని దీక్షలు వేస్తున్న సమ్మక్క బాలలు చెప్పుతున్నారు. ఒక నాడు నీటి మడుగుగా ఉన్న ఆ బావిని చందా వంశీయులు, కోయ తెగ వారు బండ రాళ్ల తో ఓడలు పేర్చారు. 100 సంవత్సరాల నుండి అంచుగా కట్టిన బండలు ఏమాత్రం స్థానబ్రంశం కాకుండా నిత్య నూతనంగా దర్శనం ఇస్తున్నాయి.సుమారు 100సంవత్సరాల కాలంలో ఆ ఊరిలో కట్టిన బావులు కూడా ఇంత పటుత్వంగా లేవని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ భావి లోతు 5,6 కండాలు మాత్రమే ఉంటుంది. మండుటెండల్లో బావిలో నీరు ఎండిపోకుండా చెలిమె నీరును పోలి ఉంటాయి.
సమ్మక్క సారక్క ల మహా జాతర జాతర దీక్షలు ప్రారంభం సందర్భంగా ముందుగా ఆదివాసీ 9తెగల సమన్వయ కర్త చుంచు రామకృష్ణ మరో 8మంది అనగా 9మందితో మాలాధారణ ముందు జలకం బావి నీటితో అభ్యంగన స్నానం ఆచరించారు. జై సమ్మక్క తల్లి సారలమ్మ తల్లుల నామస్మరణతో జలకం ఆచరించిన విధానం ధార్మిక వాతావరణంగా రూపు సంతరించుకున్నది . ఆదివాసీ మంత్రోచ్చారణ , అత్యంత ఆదివాసీ సంప్రదాయ ఆచారాలతో నేడు 21రోజుల దీక్షలు ప్రారంభం అయ్యాయి.
ఇప్పచెట్టు:
వందల ఏళ్ల నాటి ఇప్పచెట్టు ఒక మహావృక్షంగా విలసిల్లుతోంది, మదిలో కోరికలతో తల్లులకు మొక్కులు మొక్కుకొని ఇప్పచెట్టుకు ముడుపులు కట్టుకోని మరుసటి నీ జాతరకు వస్తామని ఒప్పుకున్న వారికి తప్పకుండ కోర్కెలు తీరుతున్నాయి. నిష్టాగరిష్టు లకు మాత్రమే తల్లి దీవెనలు అందుతున్నాయి
పొందుతున్నారు అని ఇక్కడి వడ్డేలు ( కోయ పూజారులు), దేవర బాలలు చెప్పడం విశేషం. ఇక్కడ వున్న జలకం బావి ,ఇప్పచెట్లు రెండు కూడా మహిమాన్వితమే , మనసా వాచా కర్మణా నమ్ముకొని ఇక్కడి ఆదివాసీ ఒడ్డెలు( పూజారుల), దేవరబాలల సలహాలు సూచనల మేరకు జాగ్రత్తగా తల్లులను దర్శించుకున్నవారికి ఆ తల్లుల కొండంత అండ ఉంటుంది అని ప్రతీతి. పూర్తి కోయత్తూర్ సంప్రదాయాలతో జరగుతున్న జాతర, సమ్మక్క పగిడిద్దరాజు ల కళ్యాణం, ఇంటి వేల్పుల సమ్మేళనంతో ప్రతి సంవత్సరం భక్తులు చిరుమళ్ళ వైపు దృష్టి సారిస్తుండటంతో ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర పాలకులు ఈ క్షేత్రం పై దృష్టి సారించి తగిన ఏర్పాట్లు, నిర్వహణ కమిటీకి తగిన ఆర్థిక సహకారం అందించాలని చిరుమళ్ళ జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, తెగల సమన్వయ కర్త చుంచు రామకృష్ణ గారు అభ్యర్థించారు.