మూగబోయిన నర్సంపేట ప్రెస్ క్లబ్

మూగబోయిన నర్సంపేట ప్రెస్ క్లబ్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నూతన కార్యవర్గ ఎన్నికలు ఎప్పుడో

జర్నలిస్టు సంఘాల లోపమా. జర్నలిస్టు నాయకుల లోపమా, లేకజర్నలిస్టుల ఐక్యత లోపమా!

నర్సంపేట జర్నలిస్టులో గుసగుసలు

తొలి సమయం నర్సంపేట జనవరి 11
నర్సంపేటలో మూగబోయి నర్సంపేట ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గం లేక విలవిలాడుతోంది,
నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఆరు మండలాలు ఉన్నాయి గతంలో కొత్తగూడా ,గూడూరు మండలంలో పనిచేసే జర్నలిస్టులు నర్సంపేట ప్రెస్ క్లబ్ పరిధిలో పనిచేశాయి,2008 ప్రెస్ క్లబ్ ఎన్నికలలో జర్నలిస్టులు ఓటు హక్కును వినియోగించుకొని కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది, అప్పటినుంచి ఇప్పటివరకు ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించలేదు.. నర్సంపేట ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రతి జర్నలిస్టు ఆలోచన చేస్తున్నారని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మౌనంగా, ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులను పట్టించుకోని ఐక్యత కోసం జర్నలిస్టు ఎన్నికల కోసం ప్రయత్నం చేయకపోవడం లోపం ఏమిటి.. అని విశ్లేషకులు మేధావులు ఆలోచన చేస్తున్నారు.. ప్రధాన జర్నలిస్టు యూనియన్స్ బాధ్యతగా తీసుకొని నర్సంపేట ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని నర్సంపేట నియోజకవర్గం లో పనిచేసే జర్నలిస్టు హక్కుల కొరకే కావచ్చు లేక జర్నలిస్టులపై దాడులను జరుగుతున్న వాటిని అరికట్టాలకు ఉపయోగపడతాయని కోరుకుంటున్నారు… కొన్ని సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకుండా ఉండడానికి జర్నలిస్టుల నాయకుల లోపమా… లేక జర్నలిస్టులు ఐక్యమత్యంగా లేకపోవడం కారణమా…? ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించి ప్రెస్ క్లబ్ కు నూతన వైభోగాన్ని తీసుకొస్తారని నర్సంపేట జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారు.. ఎవరికి వారే యమునా తీరంగా ఒకపక్క ఎలక్ట్రాన్ మీడియా యూనియన్… మరోపక్క ప్రింట్ మీడియా కమిటీ లు ఇదంతా… సరియైన జర్నలిస్టు నాయకులు లేకనే అని జర్నలిస్టులు గుసగుసలు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *